Wednesday, November 11, 2015

స్వార్దం

మనిషిని నడిపించేది స్వార్దం కాదట
“మన” అను మమకారమట
“నా” అను భావన వ్యర్దమట
 నిస్వార్దమే జీవిత పరమార్దమట
 అంతరాత్మను తాకట్టు పెట్టాల్సిందేనట,
ప్రపంచం ముందు మొకరిల్లి దేహీ!అని అడుక్కోవాల్సిందేనట
 నీ జీవితం లోకం పెట్టిన భిక్షమట
 వారు నిర్ణయించిందే నీ లక్ష్యమట
 త్యాగాలా పై వారు ప్రపంచశాంతికి యాగాలు చేస్తారట
 వ్యక్తిగత ఆలోచనలని ద్రవంగా కరిగించి హోమంలో పోస్తారట
 అది తిరిగి ప్రపంచానికి శాంతి పరిమళాలు వెదజల్లుతుందట
 ఇది లోకళ్యాణమట, పచ్చి మోసమట
 ఆత్మబలిదానానికి అందమైన మారు పేరట
 త్యాగాల తో వచ్చేది శాంతి కాదని
 గొంతు కోసి అమౄతాన్ని తాగించలేరని
 కళ్ళు పీకి ప్రకౄతి అందాలని చూపలేరని
 మనఃశాంతి కి మించిన ప్రపంచశాంతి లేదని
 సమూహానికి అంతరంగం ఉండదని,
అది మనిషికి మాత్రమే సాధ్యమని
 తెలియక జరుగుతున్న ఘర్షణ
 ఇది నా అను నిజానికి, మన అను అభూత కల్పనకి మద్య సంగ్రామం
 సమయం మించిపోతుంది – స్వార్ధమా? త్యాగమా?

No comments:

Post a Comment